హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుప్రమాదంలో గాయపడ్డ తండ్రి కూతురు మృతి

ATP: గుమ్మగట్ట మండలం పులకుంట గ్రామానికి చెందిన తండ్రి, కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా భార్య చావుబతుకుల మధ్య పోరాడుతోంది. శుక్రవారం గుమ్మగట్ట రోడ్డులో వీరు వెళ్తున్న బైకును బొలెరో ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వీరిని.. బళ్లారి విమ్స్‌కు  తరలిస్తుండగా తండ్రి సత్యన్న(28) మార్గమధ్యంలో చనిపోయారు. కుమార్తె గాయత్రి (4) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.