ప్రకాశం: కనిగిరి మండలం చీర్లదిన్నె గ్రామ సమీపంలోని చింతలవాగు వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపి వివరాల ప్రకారం.. పాలు తరలిస్తున్న ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
చీర్లదిన్నె వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి


