హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంధువుల దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు

KDP: పొరుమామిళ్ల పట్టణంలోని గిరినగర్‌లో యువకుడిపై సొంత బంధువులు మూకుమ్మడిగా దాడి చేశారు. పాత కక్షలు, వివాదాల నేపథ్యంలో రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.