హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోరుమామిళ్లలో మహిళ మృతి.. పరారీలో జవాన్!

ప్రకాశం: పోరుమామిళ్ల స్టేట్ బ్యాంక్ సమీపంలోని ఓ ఇంట్లో వైజాగ్‌కు చెందిన చెన్నా వరలక్ష్మి, కోమరోలుకు చెందిన మాజీ జవాన్ యెహోను ఉంటున్నారు. శుక్రవారం వరలక్ష్మి అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రస్తుతం యెహోను పరారీలో ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 4నెలల క్రితం వరలక్ష్మిని యెహోన్ రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం. పోరుమామిళ్ల పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.