హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుగరాజపట్నంలో షిప్‌బిల్డింగ్ క్లస్టర్

NLR: రాష్ట్రంలో మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నౌకా నిర్మాణ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దుగరాజపట్నంలో రూ.26 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో షిప్‌బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సీఎం చంద్రబాబుతో ఎండీఎల్ ప్రతినిధులు చర్చించారు. పోర్టు, షిప్‌యార్డు కోసం 2,200 ఎకరాల భూమి సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది.