హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌతాళంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్య

KRNL: కౌతాళం మండలం కామవరం ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతోంది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో దోమల బెడద పెరిగిందని కాలనీవాసులు తెలిపారు. చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని, పారిశుద్ధ్య సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.