హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మురుగునీటితో గిరిజనులు అవస్థలు

SKLM: మెలియాపుట్టి (మ)లోని పాత్రలోవ గిరిజన గ్రామంలో మురుగునీటి కాలువలు లేకపోవడంతో రోడ్లు, వీధుల్లో మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో ఈగలు, దోమలు విజృంభించి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో తాగునీటి బోరు చుట్టూ మురుగు నిల్వ ఉండటంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.