హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భర్తతో గొడవ.. భార్య సూసైడ్

TPT: తడ మండలం తడకండ్రిగలో భర్తతో జరిగిన వివాదంతో మనస్తాపానికి గురైన 25 ఏళ్ల వివాహిత పూజావర్మ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో పూజకు అవసరమైన కట్టెల విషయంలో దంపతుల మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI కొండపనాయుడు తెలిపారు.