ASR: నక్కపల్లి (M) వేంపాడుకు చెందిన కూరాకుల ఆనంద్ దక్షిణ కొరియాలో డాక్టరేట్ సాధించాడు. వరంగల్ నిట్‌లో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్ పూర్తి చేసిన ఆనంద్ ఐదేళ్ల క్రితం దక్షిణ కొరియా వెళ్లాడు. క్యుంగీ విశ్వవిద్యాలయంలో జీవశక్తితో విద్యుదుత్పత్తిపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందాడు. ఈ పరిశోధనతో బ్యాటరీలు లేకుండానే పరికరాల్లో శక్తిని నిక్షిప్తం చేయవచ్చని తెలిపాడు.
ఆంధ్రప్రదేశ్
దక్షిణ కొరియాలో జిల్లా వాసి సత్తా


