హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ సాయంత్రం వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరగనుంది. ఈ పవిత్రోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం కార్యక్రమం జరిపిస్తారు. సాయంత్రం తిరువీధుల్లో మలయప్పస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులు కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.