తిరుమలలో టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో సర్వదర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లలో భక్తులకు టీటీడీ అన్ని వసతులు కల్పించింది. నిన్న శ్రీవారిని 78,057 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,406 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు


