ప్రకాశం: కనిగిరి మండలం చిర్లదిన్నె గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు కనిగిరి మండలం వంగపాడు గ్రామానికి చెందిన భీమవరపు సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై పడి తల బలంగా రోడ్డుకు తగలడం వల్ల ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


