హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెర్రీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

VZM: బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌ సెంటర్‌లోని బెర్రీ పరిశ్రమలో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. ఆక్సిజన్‌ పైప్‌ లీకై మంటలు చెలరేగడంతో కార్మికుడు సరోజ్‌పాల్‌ (35) తీవ్రంగా గాయపడ్డాడు. సుమారు 60 శాతం శరీరం కాలిపోవడంతో చికిత్స పొందుతున్నాడు. అలజంగికి చెందిన కార్మికుడు సీతయ్య కూడా స్వల్పంగా గాయపడ్డాడు. వారిని సీపీఐ నాయకులు పరామర్శించారు.