సత్యసాయి: ముదిగుబ్బ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ శివరాముడును వీఆర్‌కు పంపారు. ఈ మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ శేముషి బాజ్‌పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ శివరాముడుపై పలు ఆరోపణలు రావడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ముదిగుబ్బకు కొత్త సీఐని నియమించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్‌కు ముదిగుబ్బ సీఐ శివరాముడు


