ASR: అనంతగిరి (M) రొంపల్లి పంచాయతీ పరిధిలోని చినకోనెల, బూరుగ, చిమిడివలస, బొంగిజ, రాయిపాడు గ్రామాల ప్రజలు తమను ఆదివాసీ గిరిజనులుగా గుర్తించాలని కోరుతూ, తలకు గిడుగులు ధరించి, జాతీయ జెండాలతో బూరుగ నుంచి రాయిపాడు వరకు సుమారు ఐదు కిలోమీటర్లు ర్యాలీ చేపట్టారు. తమ భూములను రక్షించాలని, గిరిజనేతర పంచాయతీల్లో నివసిస్తున్న గిరిజనులను ఆదివాసీ గిరిజనులుగా గుర్తించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'గిరిజనులుగా గుర్తించాలని ర్యాలీ'


