హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి విక్రేతపై పీడీ యాక్ట్!

BPT: మాచర్ల పట్టణంలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిపై శుక్రవారం పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు అర్బన్ సీఐ షేక్ నజీర్ బేగ్ తెలిపారు. పట్టణానికి చెందిన చల్లా శివ నాగరాజుపై గతంలో రెండు సార్లుకేసు నమోదైనా ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై పోలీస్‌ శాఖ కఠినంగ వ్యవహరిస్తుందని ఆయన వెల్లడించారు.