హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రికెట్ ప్రాబబుల్స్‌కు జిల్లా ప్లేయర్ల ఎంపిక

ATP: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర సీనియర్ పురుషుల మల్టీడే జట్టు ప్రాబబుల్స్‌కు జిల్లా నుంచి ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. గిరినాథ్ రెడ్డి, దత్తారెడ్డి, వినయ్‌కుమార్, మల్లికార్జున, దీపక్ చోటు దక్కించుకున్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 22 నుంచి విజయనగరంలో క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.