PLD: వినుకొండ పురపాలక సంఘంలోని పలు విభాగాల అధికారులకు ఏసీబీ అధికారినంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి బుధవారం ఫోన్లు వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మీరు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని బెదిరించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ అధికారులు ఎవరని గట్టిగా ప్రశ్నించడంతో ఆగంతకుడు ఫోన్ కట్ చేశాడట. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్
ఏసీబీ అధికారినంటూ అధికారులకు ఫోన్లు!


