అన్నమయ్య: ఖాజీపేట అగ్రహారం గ్రామంలో CI వంశీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలకు పలు సూచనలు చేశారు. శాంతియుతంగా జీవించాలని,గొడవలు,ఘర్షణలకు దూరంగా ఉండాలని కోరారు. మట్కా,జూదం,గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అగ్రహారంలో పల్లె నిద్ర చేసిన సీఐ


