హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం

ELR: మహిళలు, బాలికలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు శక్తి యాప్ రూపొందించబడిందని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు అన్నారు. పెదవేగి మండలం వంగూరులో ఉన్న జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలో విద్యార్థినీలకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించినారు. శక్తి యాప్ ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.