BHPL: చిట్యాల మండలంలోని నైన్‌పాక గ్రామానికి చెందిన మేరుగు శ్రీకాంత్ (32) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఐదు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స ఫలించలేదు. మృతుడికి భార్య కోమల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
పురుగుల మందు తాగి ఆత్మహత్య..!


