తిరుపతి జిల్లా విప్పమనుపట్టెడ గ్రామాన్ని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు, గాజులమడ్యం సీఐ మంజునాథ రెడ్డి సందర్శించారు. గ్రామస్థులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, బ్యాంక్ వివరాలు, పాస్ పోర్ట్ లను అపరచితులకు ఇవ్వొద్దని సూచించారు. మహిళలు, బాలికల భద్రత కోసం శక్తి యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె నిద్రలో గ్రామస్తులతో పోలీసులు


