హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురంలో టిప్పర్ బీభత్సం.. వ్యక్తి మృతి

KKD: పిఠాపురం పాదగయ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి టిప్పర్ లారీ, మోటార్ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, బైక్‌పై ఉన్న మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కి ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.