హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్లినికల్ యాక్ట్ నిబంధనలు తప్పక పాటించాలి'

WGL: క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్ట నిబంధనలను ప్రతి ఆస్పత్రి, క్లినిక్ తప్పనిసరిగా పాటించాలని DMHO డా, రాజారెడ్డి సూచించారు. నర్సంపేట పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లను డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. ఐ. ప్రకాశ్‌తో కలిసి తనిఖీ చేశారు. ఫైర్ సేఫ్టీ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.