హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం

WGL: ధర్మసాగర్ 60 ఎంఎల్‌డీ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడటంతో వరంగల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కరీమాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుందని బల్దియా ఈఈ సంతోష్‌బాబు తెలిపారు. సమస్యను పరిష్కరించిన అనంతరం నీటి సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.