హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ హైడ్రాలిక్ ఆయిల్ విక్రయదారుల అరెస్ట్.!

SRPT: కోదాడ పట్టణంలో నకిలీ హైడ్రాలిక్ ఆయిల్ విక్రయిస్తున్న ముగ్గురిని కోదాడ పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కుర్ర ఎల్లారాజు, గుంటి సందీప్, వసీం ఖాన్లను అదుపులోకి తీసుకుని 26 లీటర్ల చొప్పున ఉన్న 76 హైడ్రాలిక్ ఆయిల్ టిన్నులను స్వాధీనం చేసుకున్నారు. హెచ్పీసీఎల్ ప్రతినిధులతో కలిసి తనిఖీలు నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.