కోనసీమ: కొత్తపేట ఆర్.ఎస్.నగర్‌లో పోలీసు కానిస్టేబుల్ చెల్లుబోయిన రాంబాబు ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి బీరువా ధ్వంసం చేసి సుమారు 28 కాసుల బంగారం, 750 గ్రాముల వెండి ఆభరణాలు అపహరించారు. ఈ నెల 20న ఇంటికి వచ్చిన రాంబాబు చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కొత్తపేటలో పోలీసు ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ


