హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష

WNP: వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన ఆంజనేయులు మద్యం తాగి ద్విచక్ర వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. శుక్రవారం కోర్టులో హాజరు పరచగా మొదటి అదనపు న్యాయమూర్తి శ్రీలత 3 రోజుల జైలు శిక్ష విధించారు. వీపనగండ్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.