హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్దిలేటి స్వామి క్షేత్రంలో పర్యటించిన మంత్రి

NDL: బేతంచెర్ల మండలం రంగాపురం గ్రామ సమీపంలో ఉన్న శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రంలో శుక్రవారం రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మద్దిలేటి స్వామి ఆలయంలో మంత్రి బీసీ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.