ఖమ్మం 3 టౌన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం కేసులో పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. గుట్టలబజార్ ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన తుడుం గోపి చోరీకి పాల్పడినట్లు సీఐ మోహన్‌బాబు తెలిపారు. అతని వద్ద నుంచి 6.25 గ్రాముల బంగారం, 81 గ్రాముల వెండి, రూ.7 వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
దొంగతనం కేసులో నిందితుడు అరెస్ట్


