హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు

SRPT: కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి-65పై ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు 22 హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, మైనర్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై అవగాహన కల్పించారు. వాహనదారులు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్సై సూచించారు.