BHNG: ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. యాదగిరిగుట్ట మండలం లప్పనాయకండకు చెందిన గూగులోతు శంకర్ గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేసి పట్టుకున్నట్లు ఎస్‌హెచ్‌ఓ ఉదయ్‌కుమార్ తెలిపారు.
తెలంగాణ
30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.!


