హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీడీ మృతి.. ఆర్టీసీ డ్రైవర్‌‌పై కేసు నమోదు!

నంద్యాలకు చెందిన పీడీ మనోజ్ గుత్తి చెరువు కట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, విద్యార్థి రిషిద్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కుళ్లాయప్పపై శుక్రవారం ఎస్సై అమీర్ ఖాన్ కేసు నమోదు చేశారు.