హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'31 వరకు పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు గడువు'

KRNL: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈ నెల 31 వరకు గడువు ఉందని జిల్లా వ్యవసాయ అధికారిణి(జేడీ) పీఎల్ వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఎకరాకు వరికి రూ.80, మొక్కజొన్న రూ.66, కంది రూ.44, జొన్న రూ.38, ఆముదం రూ.36, ఎండుమిర్చి రూ.360, కొర్ర, సజ్జలకు రూ.32, ఉల్లికి రూ.90 చొప్పున చెల్లించాలని ఈ మేరకు రైతులకు జేడీ సూచించారు.