హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి'

KNR: ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ట్రస్మా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు కోరారు. కొండమల్లేపల్లిలో హెచ్‌ఎం హత్య ఘటనపై శుక్రవారం కలెక్టర్, సీపీకి వినతిపత్రాలు సమర్పించారు. పాఠశాలలను డ్రగ్‌ ఫ్రీ జోన్లుగా ప్రకటించి, పోలీసు గస్తీ పెంచాలని కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.