MDK: మాసాయిపేట-లింగారెడ్డిపల్లి రహదారి పూర్తిగా గుంతలమయమై ధ్వంసమైంది. ప్రత్యామ్నాయ దారి లేక రోజూ 100కు పైగా రైతు కుటుంబాలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
మరమ్మతులకు నోచుకోని లింగారెడ్డిపల్లి రోడ్డు


