VSP: మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని భీమిలిలోని గంటస్తంభం కూడలిలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు చిరంజీవి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో ఎన్నారై జనరల్ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత వైద్య శిబిరం


