కర్నూలు రూరల్ మండలం పూడూరులో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిగెల మురళీకృష్ణ సమావేశమయ్యారు. శుక్రవారం గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పూడూరులో బీజేపీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే భేటీ


