హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ అదుపుతప్పి ఒకరి మృతి

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ శివారులో శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగింది. బొప్పాపూర్‌కు చెందిన బొమ్మనవేని శ్రీను(55) బైక్‌పై కోరుట్లపేట వెళ్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. తలకు తీవ్ర గాయంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో రాచర్ల బొప్పాపూర్‌లో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.