హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశం

SRCL: ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. విధుల్లో అలసత్వం చూపుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ సుజాతను సస్పెండ్ చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అన్నారు.