హైదరాబాద్: 28°C
తెలంగాణ

న్యాయవాదుల నిరసన

PDPL: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గోదావరిఖని కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యురాలు శైలజ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఏకపక్ష నిర్ణయాలతో న్యాయవాదుల వృత్తి స్వాతంత్రం దెబ్బతింటోందని ఆరోపించారు. బీసీఐలో పారదర్శకత పెంచాలని డిమాండ్ చేశారు.