హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని వినతి

PDPL: నల్గొండ జిల్లాలో పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ పాఠశాలలు, ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝాకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. విద్యాసంస్థల వద్ద భద్రతను పెంచాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు బందారపు యాదగిరిగౌడ్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.