KMR: రాజంపేట మండల ఎస్సై డి. అంజనేయులు ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఆయన బదిలీ అయిన కేవలం 35 రోజులకే ఏసీబీకి పట్టుబడ్డారు. గతంలో బిక్కనూర్ ఎస్సైగా పనిచేసిన ఆయన స్థానిక బదిలీల్లో భాగంగా రాజంపేటకు వచ్చారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటంతో ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలంగాణ
35 రోజుల్లోనే ఏసీబీకి చిక్కిన ఎస్సై


