హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈతకు వెళ్లి.. యువకుడు జల సమాధి

KMR: పిట్లం (M) అల్లాపూర్ గ్రామంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మేకల వినయ్ (18) మేకలు, గొర్రెలను గ్రామంలోని పెద్ద కుంటలో దింపాడు. వాటి వెంటే వెళ్తున్న క్రమంలో ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. సహాయక సిబ్బంది మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.