హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాయి షిరిడీ ఎక్స్‌ప్రెస్‌లో 24.3 కిలోల గంజాయి పట్టివేత

NZB: సాయి షిరిడీ ఎక్స్ ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న 24.3 కిలోల ఎండు గంజాయిని పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండు తరలించారు. పట్టుబడిన వారిని ఒడిశాకు చెందిన గణేష్‌ పోలి (20), దీపక్‌ సాహు (21)గా గుర్తించారు.