హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కరువు జిల్లాగా ప్రకటించాలి'

అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక కార్మిక కర్షక భవనంలో శుక్రవారం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాభావం పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రైతులు వేసిన వరి నారు మడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.