హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో ఉచిత హోమియో వైద్య శిబిరం

బాపట్లలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఆయుష్ శాఖ, రెడ్ క్రాస్ సౌజన్యంతో ఉచిత హోమియో వైద్య శిబిరం శుక్రవారం జరిగింది. ఈ శిబిరంలో ఉప్పుటూరు, జిల్లెలమూడి ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్, డాక్టర్ ఐనాపురపు భువనేశ్వరి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.