కృష్ణా: జిల్లా ఉయ్యూరులో డయేరియా ప్రబలడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే 30 మంది బాధితులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు తాగునీటి శాంపిల్స్ సేకరించి శుక్రవారం పరీక్షలకు పంపారు. వ్యాధి వ్యాప్తికి కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉయ్యూరులో డయేరియా కలకలం'


