VZM: నెల్లిమర్ల నగర పంచాయతీలో 1450 మందికి ఇళ్ల పట్టాలు మంజూరై ఐదేళ్లయినా ఇప్పటికీ స్థలాలు గుర్తించలేదని బీజేపీ మండల అధ్యక్షుడు మైపాడ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్, తహసీల్దార్ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న చేపట్టే శాంతియుత ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎస్సై గోపాలరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శాంతియుత ధర్నాకు వినతి


