హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫుట్‌బాల్ క్రీడలో విద్యార్థుల సత్తా..!

SKLM: టెక్కలి పట్టణంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు వి. పూర్ణచంద్రశేఖర్, జి. బాలయోగి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జూలై 11న జరిగిన అంతర్ జిల్లా పోటీల్లో ప్రతిభ చూపి వీరు ఎంపికైనట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి. నాగేశ్వరావు తెలిపారు. ఈ నెల 28 నుంచి 4 రోజులపాటు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.